Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సారా టెండూల్కర్ పేరుతో నకిలీ ఖాతా... ఏం చేశారో తెలుసా?

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:24 IST)

Widgets Magazine
sara tendulkar

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ పేరుతో సోషల్ మీడియాలో ఓ నకిలీ ఖాతాను ప్రారంభించారు. ఈ ఖాతా ద్వారా పలువురు సెలెబ్రిటీలు, బడా రాజకీయ నేతలకు వివిధ రకాల సందేశాలు పంపుతూ వారిని బుట్టలోవేసుకుంటున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారన్నంతా ముంబైకు చెందిన ఓ టెక్కీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 
 
గత కొన్ని రోజులుగా సారా పేరిట ఉన్న ట్విటర్ ఖాతా నుంచి రాజకీయ నేతలపై వివాదాస్పద పోస్టులు వస్తుండటంతో సచిన్ వ్యక్తిగత కార్యదర్శి ఇటీవల ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సారా టెండూల్కర్‌ నకిలీ ఖాతా వ్యవహారం వెలుగుచూసింది. ఆమె ఖాతా నుంచి.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న కామెంట్లు చూసి విస్మయానికి గురయ్యామని సచిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
రంగంలోకి దిగిన పోలీసులు నితిన్ సిశోడే అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీరే ఈ ట్విటర్ ఖాతా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. గురువారం ముంబైలోని అంథేరిలో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఐపీసీతో పాటు ఐటీ చట్టం కింద పలు అభియోగాలతో అతడిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 9 వరకు కోర్టు అతడిని పోలీసు కస్టడీకి అప్పగించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్న క్రికెటర్...

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్నాడు. అది ...

news

సఫారీలను చితక్కొట్టిన విరాట్ కోహ్లీ : మూడో వన్డేలో విజయభేరీ

సఫారీ గడ్డపై భారత క్రికెటర్లు సింహాల్లో గర్జిస్తున్నారు. ఆతిథ్య జట్టును ...

news

పాక్ లెఫ్టార్మ్ పేస‌ర్‌ను మాత్ర‌మే నేను అభినందించా : రాహుల్ ద్రావిడ్

అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు డ్రెస్సింగ్ రూంకు వెళ్లి వారితో ...

news

నేను పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లలేదు.. పేస్ బౌలర్‌ని అభినందించా: ద్రవిడ్

అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా యువ జట్టుకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ ...

Widgets Magazine