గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (10:51 IST)

ప్రపంచప్ 2015లో అదుర్స్ : సిక్సర్లో సిక్సర్లు.. పరుగుల వర్షం!

ప్రపంచ కప్ 2015లో పరుగుల వర్షం పోటెత్తింది. ఎన్నడూ లేని విధంగా పరుగుల వరద పారింది. ఇందులో భాగంగా అత్యధికంగా 450 సిక్సర్లు, 2109 ఫోర్లు, 38 సెంచరీలు, 107 హాఫ్ సెంచరీలు నమోదు కావడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన ఈమెగా ఈవెంట్కు మరింత ఆకర్షణ తెచ్చేందుకు పిచ్లను బ్యాటింగ్కు అనుకూలించేలా రూపొందించారు. దీంతో ఫోర్లు, సిక్సర్లతో తడిసి అభిమానులు ముద్దయ్యారు.
 
ఈ మెగా ఈవెంట్‌లో బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లను రూపొందించడంతో బ్యాట్స్ మెన్ తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఈ ప్రపంచ కప్‌లో మొత్తం 21,614 పరుగులు వచ్చాయి. వీటిల్లో సగానికి పైగా బౌండరీల రూపంలో (11,136 పరుగులు) వచ్చాయి. మొత్తం 450 సిక్సర్లు, 2109 ఫోర్లు నమోదయ్యాయి. ఆటగాళ్లంతా కలసి 38 సెంచరీలు, 107 హాఫ్ సెంచరీలు చేశారు. బౌలర్లు 687 వికెట్లు పడగొట్టగా, అందులో 497 సార్లు క్యాచ్‌ల రూపంలో ఆటగాళ్లు అవుట్ అయ్యారు.