Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీమిండియా చీఫ్ కోచ్ పదవి ఫిక్స్. ఇది పక్కా.. రవిశాస్త్రే రెకమెండేషన్ క్యాండిడేట్

హైదరాబాద్, సోమవారం, 10 జులై 2017 (08:35 IST)

Widgets Magazine
Ravi Shastri

పోస్టు ఎవరితో ముందే ఫిక్స్ అయిపోయిన టీమిండియా చీఫ్ కోచ్ పదవికి మరి కాస్సేపట్లో ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. భారత క్రికెట్ సలహా మండలి సభ్యులు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, గంగూలీ సోమవారం ఉదయం, టీమిండియా చీఫ్ కోచ్ పదవికి అభ్యర్థులు పంపిన దరఖాస్తులను పరిశీలించనున్నారు. అయితే ఈ పరిశీలన మొత్తం నామామాత్రమేనని, టీమిండియా చీఫ్ కోచ్ ఎవరో ఇప్పటికే నిర్ణయించేశారని పుకార్లు బయలుదేరాయి. టీమ్‌కు, ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి  అత్యంత ఇష్టుడు, నమ్మకస్తుడు అయిన రవిశాస్త్రికే ప్రధాన కోచ్ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. 
 
చీఫ్ కోచ్ పదవి కోసం దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనుండగా ఇప్పటి వరకు పది దరఖాస్తులు అందాయి. కోచ్ పదవిని ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న వారిలో రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుత్, లాన్స్ క్లుసెనర్, రాకేశ్ శర్మ (ఒమన్ జాతీయ జట్టు కోచ్), ఫిల్ సిమన్స్, ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి దరఖాస్తు చేసుకున్నారు. బ్రహ్మచారి ఇంజినీర్. ఇతనికి క్రికెట్‌తో గతంలోకానీ, ప్రస్తుతం కానీ ఎటువంటి సంబంధాలు లేకపోవడం విశేషం. టీమిండియా చీఫ్ కోచ్ రేసులో మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ముందు వరుసలో ఉన్నట్టు క్రీడా పండితులు చెబుతున్నారు. 
 
అయితే కొత్త కోచ్‌ను ఎంపిక చేయనున్న గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) వీరిలో ఆరుగురినే ఇంటర్వ్యూకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. సోమవారం నిర్వహించనున్న ఇంటర్వ్యూకు రవిశాస్త్రి, సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, సిమన్స్‌, రిచర్డ్ పైబస్‌, రాజ్‌పుత్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో రవిశాస్త్రికే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు క్రీడా వర్గాలు చెబుతున్నాయి.
 
భక్తుడు కోరింది, దేవుడు తీర్చింది ఒకే కోరికే అన్నట్లు కెప్టెన్ మద్దతు పుష్కలంగా ఉన్న రవిశాస్త్రికి చీఫ్ కోచ్ లభిస్తే విరాట్ కోహ్లీ ఆడింది ఆట, పాడింది పాట కావడం ఖాయం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మనోళ్లు దుమ్మురేపారు కానీ వాళ్లూ డబుల్ దుమ్ము లేపారు. టీ20లో విండీసే విజేత

భారత్‌తో జరుగుతున్న ఏకైక టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ అద్భుత ...

news

శ్రీలంక పర్యటన : భారత్ షెడ్యూల్ ఖరారు

భారత క్రికెట్ జట్టు త్వరలో శ్రీలంకలో పర్యటించనుంది. సుమారు ఎనిమిదేళ్ళ తర్వాత భారత్ ...

news

ధోనీ వెళ్లిపోవలసిన సమయం వస్తే తనే తప్పుకుంటాడు.. చిన్ననాటి కోచ్ సమర్థన

జట్టుకు భారమైన క్షణంలో టీమిండియా నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకుంటాడని, ఆ విషయంలో ఒకరు ...

news

ప్రపంచ రికార్డుకు చేరువవుతున్నా గుర్తింపుకు ఆమడదూరంలో మిథాలీ రాజ్

మైదానంలో ప్రశాంతంగా కదులుతూ ఆటను ప్రత్యర్థి జట్టునుంచి లాగిపడేయడంలో మిస్టర్ కూల్ ధోనీని ...

Widgets Magazine