Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫాస్ట్‌ బౌలర్లకు స్ఫూర్తినిస్తున్న ఉమేశ్ యాదవ్ మెరుపు బౌలింగ్

హైదరాబాద్, ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (04:02 IST)

Widgets Magazine
mumbai cricket stadium


మహా మహా జట్లే బారత్ చేతిలో పేకమేడల్లా కూలిపోయిన తరుణంలో టెస్ట్ క్రికెట్లో పసికూనలుగా భావిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు హైదరాబాద్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు భారత్‌కి చుక్కలు చూపించింది. రోజు మొత్తం మీద 5 వికెట్లు మాత్రమే భారత బౌలర్లు పడగొట్టగా అందులో రెండు బంగ్లా బాట్స్‌మెన్ చేతకానితనం వల్లే జరిగాయి. మూడో రోజు భారత్ స్పిన్నర్లు తేలిపోగా ఫేసర్ ఉమేష్ యాదవ్ నాణ్యమైన బౌలింగ్‌తో స్పిన్ పిచ్‌లో బంగ్లా జట్టుకు చుక్కలు చూపించాడు.ట
 
భారత్‌కు నిరాశ కలిగించిన మూడో రోజు ఆటలో చెప్పుకోదగ్గ అంశం ఉమేశ్‌ యాదవ్‌ ప్రదర్శన. రెండో రోజు 142 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతితో సౌమ్య సర్కార్‌ను అవుట్‌ చేసిన అతను, శనివారం కూడా దానిని కొనసాగించాడు. అటు వేగం, ఇటు స్వింగ్‌ జత కలిపి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఆధిక్యం ప్రదర్శించాడు. ముఖ్యంగా 23 నుంచి 33 వరకు ఆరు ఓవర్ల పాటు సాగిన  రెండో స్పెల్‌లో ఉమేశ్‌ చెలరేగిపోయాడు. ముందుగా మోమినుల్‌ను అవుట్‌ చేసిన అతను, ఆ తర్వాత వేగవంతమైన ఆఫ్‌ కట్టర్లతో షకీబ్‌ను బెదరగొట్టాడు. 
 
అటు ఫీల్డింగ్‌లో కూడా కొన్నాళ్లుగా మైదానంలో పాదరసంలా కదులుతూ ఫాస్ట్‌ బౌలర్లకు స్ఫూర్తినిస్తున్న ఉమేశ్, మరోసారి అలాంటి ఆటనే చూపించాడు. అతని అద్భుతమైన త్రో కారణంగానే తమీమ్‌ రనౌటయ్యాడు. ఉమేశ్‌ పని అంతటితో పూర్తి కాలేదు. అశ్విన్‌ బౌలింగ్‌లో మిడాన్‌లో చక్కటి క్యాచ్‌ కూడా అందుకొని ప్రధాన బ్యాట్స్‌మన్‌ షకీబ్‌ను పెవిలియన్‌ పంపాడు. మొత్తంగా మూడోరోజు ఆటలో మైదానంలో అన్నింటా ఉమేశ్‌ కనిపించాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

ఔట్ కాకున్నా కోహ్లీ ఎందుకు ఔటయ్యాడు? అదే కెప్టెన్సీ అంటే..!

బంగ్లాదేశ్‌ జట్టుతో హైద్రాబాద్‌లో జరుగుతున్న రెండో రోజు మ్యాచ్‌లో ఒక అరుదైన ఘటన జరిగింది. ...

news

కెప్టెన్ అయితే కొమ్ములొస్తాయా? అందుకే మరింత బాధ్యతగా ఆడుతున్నా అన్న కోహ్లీ

భారత జాతీయ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా తనలో అలసత్వానికి చోటు లేదని, అందుకే సాధారణ ...

news

బ్రాడ్‌మెన్ - ద్రావిడ్ రికార్డులు చెరిపేసిన విరాట్ కోహ్లీ... ఎలా?

సమాకాలీన క్రికెట్‌లో పరుగుల యంత్రంగామారి రికార్డుల రారాజుగా పిలుపించుకుంటున్న టీమిండియా ...

news

ఉప్పల్ టెస్ట్ : 68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మురళి, పుజారా.. కోహ్లీ అరుదైన ఘనత

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌లో ...

Widgets Magazine