శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2017 (12:43 IST)

పూణే టెస్టు.. ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డు.. వార్నర్‌ను ఐదుసార్లు అవుట్ చేసి?

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్.. తొలి రోజు ఆటలో టీమిండియా పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఆటలో భా

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్.. తొలి రోజు ఆటలో టీమిండియా పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఆటలో భాగంగా ఆస్ట్రేలియా లంచ్ విరామానికి వికెట్ కోల్పోయి 84 పరుగులు సాధించింది. 
 
అయితే ఉమేష్ యాదవ్ మాత్రం ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేయడం ద్వారా టెస్టుల్లో ఒక ఆటగాడిని అత్యధిక సార్లు అవుట్ చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్లైంది. 
 
ఓపెన‌ర్‌గా క్రీజులోకి వ‌చ్చిన డేవిడ్‌ వార్నర్ 38 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరువ‌ద్ద‌ వికెట్‌ కోల్పోయాడు. టెస్టుల్లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో వార్నర్ అవుట్ కావడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఈ మ్యాచ్ ముందు వ‌ర‌కు ఆస్ట్రేలియా బౌలర్ షాన్ మార్ష్ ఐదుసార్లు అత్యధికంగా ఒక ఆటగాడిని అవుట్ చేసిన బౌల‌ర్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఉమేశ్ యాద‌వ్ కూడా అతని సరసన చేరిపోయాడు. గురువారం నాటి ఇన్నింగ్స్ ద్వారా వార్నర్ ఐదోసారి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తద్వారా ఉమేశ్ ఆస్ట్రేలియా బౌలర్ షాన్ మార్ష్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. 
 
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రెన్షా (36), వార్నర్ (38) పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ప్రస్తుతం స్మిత్ (11), మార్ష్ (10) క్రీజులో ఉన్నారు. ఫలితంగా 39.2 ఓవర్లలో ఆస్ట్రేలియా ఒక వికెట్ పతనానికి 104 పరుగులు సాధించింది.