బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (14:25 IST)

అబ్బే అవేం లేదు.. త్రిషతో నిశ్చితార్థమైంది.. వదిలేయండి ప్లీజ్!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనేది లేదని త్రిష కాబోయే భర్త వరుణ్ మణియన్ స్పష్టం చేశారు. బీసీసీఐ మాజీ చీఫ్‌ శ్రీనివాసన్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రికెట్‌ టీం (సీఎస్‌కే)ను నటి త్రిషకు కాబోయే భర్త వరుణ్‌మణియన్‌ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ట్విట్టర్ సాక్షిగా కొట్టిపారవేశారు.
 
తాను 20-20 క్రికెట్‌ టీం కొంటున్నట్లు వచ్చిన వార్తలపై వరుణ్‌ ట్విట్టర్ లో స్పందించారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు వరుణ్ ట్వీట్ చేస్తూ.... ‘ఇపుడే నిశ్చితార్ధం జరిగింది, త్రిష నేను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం, ఏ టీం కొనే ఆలోచన లేదు, కాస్త ఏకాంతంగా వదిలేయండి' అని ట్వీట్‌ చేశారు.