Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నెం.1: విరాట్ ఖాతాలో రూ. 100 కోట్ల డీల్

బుధవారం, 14 జూన్ 2017 (11:42 IST)

Widgets Magazine
virat kohli

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆట‌గాడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ప్ర‌స్తుతం ర్యాకింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ ఏబీ డీ విల్లియ‌ర్స్‌, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్‌ల‌ను వెన‌క్కునెట్టేశాడు. 
 
ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో రెండో మ్యాచులో మిన‌హా కోహ్లీ మిగ‌తా రెండు మ్యాచుల్లో కోహ్లీ రాణించిన సంగతి తెలిసిందే. దీంతో వ‌న్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో త‌న ర్యాంకును మెరుగు ప‌రుచుకున్న కోహ్లీ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 
 
ప్ర‌స్తుతం కోహ్లీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో 861 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉండ‌గా, డేవిడ్ వార్నర్. కోహ్లీ కంటే ఒకే ఒక్క పాయింట్ వెన‌క‌బ‌డి 861 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక  ఏబీ డీ విల్లియ‌ర్స్ 847 పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. 
 
ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్, వన్డేల్లో నంబర్ వన్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో భారీ డీల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారీ మొత్తం చెల్లించి కోహ్లీతో డీల్ కుదుర్చుకోవాలని పెప్సీకో ఇంకా తన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే పెప్సీకోతో తన ఒప్పందాన్ని తెంచుకున్నానని కోహ్లీ ప్రకటించాడు.  తాను వినియోగించని శీతల పానీయాలకు ప్రచారం చేయలేనని కోహ్లీ తెగేసి చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 8 సంవత్సరాల కాలానికి తమ ఉత్పత్తులను ప్రచారం చేసి పెట్టేందుకు ప్రముఖ టైర్ల సంస్థ ఎంఆర్ఎఫ్ కోహ్లీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
 
ఇప్పటికే స్పోర్ట్స్ ఉత్పత్తుల సంస్థ పూమాతో రూ. 100 కోట్ల విలువైన 8 ఏళ్ల కాంట్రాక్టును గతంలో కోహ్లీ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది కోహ్లీకి రెండో 100 కోట్ల డీల్ కావడం గమనార్హం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

కేన్సర్‌ను జయించి, బంతిని దంచి కొట్టిన యువరాజసం

గోడకు కొట్టిన ప్రతిసారీ అంతే బలంగా వెనుదిరిగి రావడం అతనికి తెలిసినంత బాగా బహుశా సమకాలీన ...

news

అనుష్కతో అదలా పంచుకుంటుంటే కన్నీళ్లొచ్చాయ్... మర్చిపోలేను... విరాట్ కోహ్లి

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, అనుష్కతో ఉన్న సంబంధం గురించి ఏనాడూ మీడియా ...

news

కీలక సమయాల్లో ఒంటరిగా ఉన్నాననే భావన రాకూడదు... అందుకే ధోనీ హెల్ప్ అవసరం: కోహ్లీ

ప్రతి మ్యాచ్‌లోనూ ధోనీ సలహాలు తీసుకోవడం అంటే అతడిపై ఆధారపడుతున్నానని అర్థం కాదని ...

news

శ్రీలంకతో మ్యాచ్ ఓడగానే కోహ్లీ అంత పరుషంగా మాట్లాడాడా... మరి కుంబ్లే చేసేదీ అదే కదా?

కీలకమైన మ్యాచ్ ఓడిపోయి జట్టు మొత్తం లయ తప్పుతున్న నేపథ్యంలో జట్టు కేప్టెన్‌గా కఠినంగా ...

Widgets Magazine