శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2015 (14:16 IST)

నా ఫెయిల్యూర్‌తో అనుష్కకు ఏంటి సంబంధం.. ఒక్క మ్యాచ్‌లో?: కోహ్లీ

లేటుగా అయినా విరాట్ కోహ్లీ లేటెస్ట్‌గా స్పందించాడు. వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమిపై టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాకు సూటిగా సమాధానమిచ్చాడు. సెమీస్ ఓటమి తనను కలవరపాటుకు గురిచేసిందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ''సెమీస్‌లో నా ఫెయిల్యూర్ కు, నా గర్ల్ ఫ్రెండ్ అనుష్కకు సంబంధమేముంది"? అని కూడా మీడియాను ప్రశ్నించాడు. 
 
అయినా ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాననే నిందిస్తారా అంటూ మీడియాపై ఫైర్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో కోహ్లీ సింగిల్ పరుగుకే ఔటైన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందురోజు అనుష్క శర్మతో చక్కర్లు కొట్టిన కారణంగానే కోహ్లీ విఫలమయ్యాడని మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. వీటిపై కోహ్లీ ఘాటుగా స్పందించాడు.