Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విరాట్ కోహ్లీని ఏకిపారేసిన సెహ్వాగ్... కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగడం అనుమానమే

బుధవారం, 24 జనవరి 2018 (11:29 IST)

Widgets Magazine
sehwag

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్విట్టర్లో యాక్టివ్‌గా వుంటూ మస్తుగా ఫాలోవర్స్‌ను సంపాదించిపెట్టుకున్న భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విరాట్ కోహ్లీని ఏకిపారేశాడు. మైదానంలో కోహ్లీ ఎన్నో తప్పులు చేస్తున్నాడని.. మైదానంలో కానీ, డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ కోహ్లీ చేస్తున్న పొరపాట్ల గురించి వేలెత్తి చూపే ఒక్క ఆటగాడు కూడా లేడని తెలిపాడు. 
 
కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెనే కానీ.. ఇతర ఆటగాళ్ల నుంచి కూడా అదే స్థాయి ఆటతీరును ఆశిస్తున్నాడని.. అందుకే అంచనాలను అందుకోలేకపోయాడని చెప్పాడు. ఇదే పరిస్థితి కొనసాగితే కోహ్లీ కెప్టెన్సీగా కొనసాగడం అనుమానమేనని చెప్పుకొచ్చాడు. 
 
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతనిలా ఎక్కువ పరుగులు చేయాలని అడిగేవాడని..  తనలా వేగంగా ఎందుకు రన్స్ చేయడం లేదని ప్రశ్నించేవాడని కోహ్లీ గుర్తు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్‌ల సలహాలు తీసుకుంటున్న కోహ్లీ, మైదానంలో వాటిని అమలు పరచడం లేదని అన్నాడు. ఒక్కరి కష్టంతో విజయం కుదరదని.. జట్టు సభ్యులంతా సమిష్టిగా కృషి చేయాలని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Mistakes Virat Kohli Virendra Sehwag Sachin Tendulkar South Africa Test

Loading comments ...

క్రికెట్

news

విరాట్ కోహ్లీ దీర్ఘకాలిక కెప్టెన్‌గా కొనసాగుతాడా?

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ గొప్ప ఆటగాడనే ...

news

విరాట్ కోహ్లీకి అంత సీన్ లేదు: గ్రేమ్ స్మిత్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ పటిమపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ ...

news

పరువు కోసం భారత్ వెంపర్లాట.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన సఫారీలు

సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు పరువు కోసం వెంపర్లాడుతోంది. అదేసమయంలో ఆతిథ్య ...

news

క్రికెట్ చరిత్రలో స్టన్నింగ్ క్యాచ్ (వీడియో)

క్రికెట్ చరిత్రలో ఎన్నో అరుదైన క్యాచ్‌లను చూసివుంటారు. కానీ, ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్‌లను ...

Widgets Magazine