గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 మే 2015 (14:50 IST)

విరాట్ కోహ్లీ కోపం తగ్గించుకో.. లేకుంటే నష్టమే: సైకాలజిస్ట్ సలహా

టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతగా చెలరేగుతాడో.. అంతే కోపంతోనూ ఊగిపోతాడు. అయితే ఈ తరహా స్వభావంతో కోహ్లీకే కాకుండా మొత్తం టీమిండియాకే నష్టం తెచ్చిపెడుతుందని మానసిన వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాక ‘‘కోహ్లీ... కాస్త కోపం తగ్గించుకో’’ అంటూ సలహాలు ఇస్తున్నారు. ఈ మేరకు కోహ్లీకి ప్రముఖ సైకాలజిస్ట్ బీపీ బామ్ అడక్కుండానే సలహా ఇచ్చారు. 
 
‘‘అభిమానులు, భారత్ క్రికెట్ కోసం కోహ్లీ... తన టెంపర్ ను తగ్గించుకోవాల్సి ఉంది. దూకుడు తనం వల్ల విరాట్ కోహ్లీపై వేటు పడితే, టీమిండియాకు ఎంతో నష్టం. తరచూ నిగ్రహాన్ని కోల్పోతే, అభిమానుల దృష్టిలో ఎలాంటి ముద్ర పడుతుందో కోహ్లీ ఆలోచించుకోవాలి’’ అని బామ్ అన్నారు.

అదే సమయంలో తన భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో కూడా కోహ్లీకి బాగా తెలుసని బామ్ చెప్పారు. ఆమాత్రం నిగ్రహ శక్తి లేకపోతే ఆసీస్ టూర్‌లో కోహ్లీ నాలుగు సెంచరీలు ఎలా చేయగలడంటూ ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు.