Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్ క్రికెట్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సత్తా కోహ్లిది.. బలిపశువును చేయవద్దు

హైదరాబాద్, బుధవారం, 28 జూన్ 2017 (02:12 IST)

Widgets Magazine
anurag thakur

టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అర్థాంతర రాజీనామా వెనుక కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రమేయం ఉందంటూ భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్న సమయంలో కోహ్లీని బలిపశువును చేయవద్దంటూ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించాడు. కోచ్‌గా కుంబ్లే వైదొలగడానకి విరాట్ కోహ్లీనే కారణం అనడం సరికాదని, ఇలా ఊరకే నిందలేయడం మూలాన గతంలో కూడా చాలాసార్లు కెప్టెన్లు, మాజీ కేప్టెన్లు బలైపోయారని ఠాకూర్ అంటున్నారు. కోహ్లీ మీద అనవసర దుష్ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో బీసీసీఐ పెద్దలు సమాధానం చెప్పాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తపర్చారు.
 
భారత క్రికెట్ కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే వైదొలగడానికి కెప్టెన్ విరాట్ కోహ్లినే అనడం ఎంతమాత్రం సరికాదని అంటున్నారు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్. ఈ ఉదంతంలో కోహ్లినే  టార్గెట్ చేస్తూ ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు.
 
'అనిల్ కుంబ్లే కోచ్ గా తప్పుకున్న తరువాత విరాట్ కోహ్లిని ఎటువంటి కారణం లేకుండా టార్గెట్ చేశారు. కుంబ్లే వైదొలగడానికి విరాట్ అనే చర్చను ఇకనైనా ఆపితే మంచిది. వచ్చే 10 ఏళ్లలో భారత్ క్రికెట్ ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సత్తా కోహ్లికి ఉంది. ప్రస్తుతం అనవసరంగా కోహ్లిని బలపశువుని చేయడానికి యత్నిస్తున్నారు. భారత్ క్రికెట్ లో ఇలా జరగడం మొదటిసారేమీ కాదు. గతంలో కూడా చాలాసార్లు కెప్టెన్లు, మాజీ కెప్టెన్లు బలైపోయారు. ఇప్పుడు విరాట్ కోహ్లి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రస్తుత క్రికెట్ బోర్డు పెద్దలు సమాధానం చెప్పాల్సి ఉంది' అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. 
 
ఈ తరహా వివాదాల్ని అంతకుముందు క్రికెట్ బోర్డు చాలా చాక్యంగా పరిష్కరించిందని అనురాగ్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత జట్టులో ఏమైనా సమస్యలున్నా అవి ఎప్పుడూ బయటకు లీక్ కాలేదన్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

రవిశాస్త్రిది నాలుకా తాటిమట్టా.. కోచ్ పదవికి దరఖాస్తు...కోహ్లీ వత్తాసేనా?

అనుకున్నట్లే జరుగుతోంది. టీమిండియాపైనే కాదు బీసీసీఐ మీద కూడా కెప్టెన్ కోహ్లీ ప్రభావం, ...

news

కోహ్లీ వంకచక్కంగా తీస్తా.. జట్టు కోచ్ పదవి ఇవ్వండి: దరఖాస్తు చేసుకున్న ఇంజనీర్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓ ఇంజనీర్ పగబట్టాడు. ఫలితంగా అతని ...

news

నిరుద్యోగులుగా మారనున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఎందుకు?

ఆస్ట్రేలియా క్రికెటర్లు నిరుద్యోగులుగా మారనున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి వారి ఉద్యోగాలు ...

news

బోణీ కొట్టిన భారత్... విండీస్‌పై 105 పరుగుల తేడాతో ఘనవిజయం

కరీబియన్‌ పర్యటనలో భారత్‌ బోణి కొట్టింది. ఏకంగా 105 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు ...

Widgets Magazine