శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 జులై 2016 (14:28 IST)

ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు ఇంత పనిచేస్తాడనుకోలేదు: కోహ్లీపై రిచర్డ్స్ ప్రశంసల జల్లు

అద్భుతమైన ఫామ్‌లో దూసుకెళ్తున్న టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీపై విండీస్ మాజీ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ అభిమానుల జాబితాలో చేరిన రిచర్డ్స్.. కోహ్లీ ఆటను ఆస్వా

అద్భుతమైన ఫామ్‌లో దూసుకెళ్తున్న టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీపై విండీస్ మాజీ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ అభిమానుల జాబితాలో చేరిన రిచర్డ్స్.. కోహ్లీ ఆటను ఆస్వాదించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నాడు. విరాట్ ఇన్నింగ్స్ చూడని వారు చాలా కోల్పోతారని, తాను తొలిసారి కోహ్లీ ఆటను చూశాక అలా అనిపించిందని రిచర్డ్స్ తెలిపాడు. 
 
వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సెంచరీతో కోహ్లీ అదరగొట్టాడని రిచర్డ్స్ అన్నాడు. 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ పవరేంటో చూశానని.. మ్యాచ్‌కు ముందు ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్‌లో ఉన్న భారత ఆటగాళ్లను కలిశానని తెలిపాడు.

ఈ సందర్భంగా కోహ్లీకి ఆల్ ది బెస్ట్ చెప్పానని, తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ ఇన్నింగ్స్ సూపరంటూ కితాబిచ్చారు. కేవలం ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు ఇంత పని చేస్తాడని ఊహించలేదని రిచర్డ్స్ వ్యాఖ్యానించాడు. ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ సెంచరీలు సాధించడం చూసి షాక్ అయ్యానన్నాడు.