బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 2 ఫిబ్రవరి 2017 (05:07 IST)

టాస్ ఓడిన ప్రతిసారీ మేమే గెలిచాం. క్రికెట్ అంటే అదే అంటున్న కోహ్లీ

టి20 సీరీస్‌లో మూడు మ్యాచ్‌లలో టాస్ కోల్పోయాం, టెస్టు సీరీస్‌లోనూ టాస్ కోల్పోయాం. వన్డే సీరీస్‌లోనూ అదే జరిగింది. కానీ టాస్ కోల్పోయిన ప్రతి చోటా మేమే గెలిచాం. అదీ క్రికెట్ అంటే అంటున్నాడు కోహ్లీ. పరిస్థితులు ఎలా డిమాండ్ చేస్తే అలా ఆడుతూ వస్తున్నాం క

టి20 సీరీస్‌లో మూడు మ్యాచ్‌లలో టాస్ కోల్పోయాం, టెస్టు సీరీస్‌లోనూ టాస్  కోల్పోయాం. వన్డే సీరీస్‌లోనూ అదే జరిగింది. కానీ టాస్ కోల్పోయిన ప్రతి చోటా మేమే గెలిచాం. అదీ క్రికెట్ అంటే అంటున్నాడు కోహ్లీ. పరిస్థితులు ఎలా డిమాండ్ చేస్తే అలా ఆడుతూ వస్తున్నాం కాబట్టే మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించగలుగుతున్నాం అన్నాడు కోహ్లీ. ఎంఎస్ ధోనీ స్టంప్‌ల వెనుక ఉండటం,అనుభవజ్ఞులైన అశ్విన్, యువీలు జట్టులో ఉండటం జట్టుకు ఎంత శ్రేయస్కరమో అందరికీ తెలుసు. వీలు కుదిరినప్పుడల్లా ఈ ముగ్గురి సలహా తీసుకుంటూనే ఉంటాను. అద్భుతమైన మేధావులు వీళ్లు. టీమ్ ఈరోజు ఇలా ఉందంటే వీరే కారణం అంటూ సీనియర్లను ప్రశంసించాడు కోహ్లీ.
 
ఇంగ్లండ్‌తో బెంగళూరులో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో మిశ్రా వేసిన రెండు ఓవర్లు మాకు కీలకమైంది. ఇక యువరాజ్ సింగ్ జోర్డాన్ బౌలింగులో కొట్టిన 3 సిక్సర్లు మొత్తం ఆటనే మలుపుతిప్పాయి. దాంతోనే వేగంగా 200 పరుగుల వరకూ చేరుకోగలిగాం. ఇక్కడే మానసికంగా మాకు అనుకూలత ఏర్పడింది ఇకపోతే డ్రై వికెట్ ఉన్నప్పుడు జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండటం మాకు అవకాశాలు కల్పిస్తుందని తెలుసు. మిశ్రా అలా ప్రారంభించాడు. చాహల్ రెండు ఓవర్లలో అయిదు వికెట్లు తీశాడు. ఈ మైదానంలో పరిస్థితులు అతడికి కొట్టిన పిండి. ఇక్కడ ఎలా బౌలింగ్ చేయాలా తనకు తెలుసు. అతడిపై నాకు చాలా నమ్మకం ఉంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడతాడు. చాలా నైపుణ్యం ఉంది.
 
ఇక ధోనీ. నేను తనను బ్యాంటింగ్ ఆర్డర్‌లో ముందుకు నెట్టాలనుకుంటాను. కానీ తాను చివర్లోనే ఆడతానని, అప్పుడే టీమ్‌కు మంచి సమతుల్యత ఏర్పడుతుందని ధోనీ చెబుతాడు. ఒక పెద్ద గేమ్ రానివ్వండి. చివరకు వన్డే సీరీస్‌లో అయినా సరే.. సీరీస్‌ని నిర్ణయించే మ్యాచ్ అయినా సరే.. తాను బ్యాటింగ్ ఆర్టర్లో ముందుకు వస్తాడు. ఈ రోజు కూడా అలాగే వచ్చాడు. ఇలాంటి సీరీస్‌ని గెలుపొందడం మా జట్టు మొత్తానికి చిరస్మరణీయమైనది. గత మూడు నెలల కాలం  భారత క్రికెట్ టీమ్‌కి అద్భుత క్షణాలు. ముందుకు సాగే కొద్దీ ప్రతి ఫార్మాట్‌లో మేం ఏం చేయాలో అదే చేస్తూ పోయాం అంటూ తన జట్టు పొందిక గురించి స్పష్టంగా వివరించాడు.