శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 జూన్ 2016 (12:09 IST)

జింబాబ్వేలో అత్యాచారం కేసులో అరెస్టై రిలీజైన క్రికెటర్ ఎవరు? డీఎన్ఏ టెస్టుకు సిద్ధమట!

జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోపణలు వచ్చాయి. ఆ దేశానికి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు స్థానిక మీడియాలో వార్తలు రావడం సంచలనంగా మారాయి. దీంతో ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారత క్రికెటర్లు ఎవరూ అత్యాచారం కేసులో అరెస్టు కాలేదంటూ వివరణ ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది.
 
అయితే, అత్యాచారం ఆరోపణల్లో ఈ సిరీస్‌ను స్పాన్సర్ చేస్తున్న సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. అదేసయమంలో ఓ భారత క్రికెటర్ పాత్ర కూడా ఉన్నట్టు వినికిడి. దీంతో ఆగ్రహించిన ఆ క్రికెటర్ తాను అలాంటివాడిని కాదనీ, అవసరమైతే డీఎన్ఏ టెస్టుకు సిద్ధమంటూ ప్రకటించినట్టు సమాచారం. అత్యాచారం కేసులో సంబంధం లేకుండా ఆ క్రికెటర్ ఇలా ఎందుకు ప్రకటించారన్నదానిపై ఇపుడు చర్చ జరుగుతోంది. పైగా, ఆ క్రికెటర్ ఎవరన్నదానిపై మీడియా ఆరా తీస్తున్నట్టు సమాచారం. 
 
కాగా, ఈ అంశంపై బీసీసీఐ వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. నిజానిజాలు పూర్తిగా తెలియకముందే వ్యాఖ్యానించడం తగదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే టోర్నీని భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.