Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేడు వెస్టిండీస్‌తో ఆఖరి వన్డే... భారత్‌కు పరీక్ష

గురువారం, 6 జులై 2017 (14:00 IST)

Widgets Magazine
virat kohli

కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టుకు గురువారం ఓ పరీక్ష ఎదురుకానుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే మ్యాచ్‌ను ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో ఆడనుంది. వర్షం కారణంగా తొలి వన్డే రద్దయినా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు నెగ్గడంతో 4-0తో సిరీస్‌ మనదేనని ఊహించాం. 
 
కానీ, గత మ్యాచ్‌లో విండీస్‌ దిమ్మదిరిగే షాక్‌ ఇవ్వడంతో సీన్‌ రివర్సైంది. ఇప్పుడు ఆఖరి వన్డేలో నెగ్గితేనే కోహ్లీసేన సిరీస్‌ దక్కించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కరీబియన్లు సిరీస్‌ సమం చేస్తే మాత్రం భారత్‌కు అవమానమే. అందుకే ఇపుడు భారత్ ముందు ఓ సవాల్ ఉంది. 
 
సబినా పార్క్‌లో జరిగే ఆఖరాటలో నెగ్గి 3-1తో సిరీస్‌ కైవసం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తుండగా.. సిరీస్‌ సమం చేయాలని విండీస్‌ ఆశిస్తోంది. గత పోరులో తమ విజయం గాలివాటం కాదని చెప్పాలని ఆతిథ్య జట్టు పట్టుదలతో ఉంది. 
 
అయితే, సిరీస్‌ నెగ్గాలంటే బ్యాట్స్‌మెన్‌ అంతా సత్తా చాటాల్సిందే. గత మ్యాచ్‌లో అనూహ్య విజయం విండీస్‌ శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపింది. సిరీస్‌ సమం చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని ఆ జట్టు భావిస్తోంది. ఓడినా తమకు పోయేదేమీ లేదు గనుక కరీబియన్లు స్వేచ్ఛగా ఆడి మరో సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశం లేకపోలేదు. 
 
జట్లు (అంచనా)
భారత్‌: అజింక్యా రహానె, శిఖర్ ధవన్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), దినేష్ కార్తీక్‌, ధోనీ, కేదార్‌/రిషభ్‌, హార్దిక్ పాండ్యా‌, జడేజా/అశ్విన్‌, కుల్దీప్‌, ఉమేష్‌, షమి.
 
వెస్టిండీస్‌: లూయిస్‌, కైల్‌ హోప్‌, షై హోప్‌ (కీపర్‌), ఛేజ్‌, మహమ్మద్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), పావెల్‌, నర్స్‌, బిషూ, జోసెఫ్‌, విలియమ్స్‌. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఏ గ్రేడ్‌పై మళ్లీ రగడ.. ధోనీకి మద్దతుగా బీసీసీఐ ప్రకటన అవసరమేమో?

టీమంతా ఆడలేక చతికిల బడిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి కూడా జట్టును చివరి ఓవర్‌లో ...

news

మహిళల ప్రపంచ కప్‌లో వరుసగా నాలుగో విజయం.. వీళ్లపైన ఇంత చిన్న చూపా

ప్రపంచ క్రికెట్ యవనికపై ఇంత అనితర సాధ్య విజయాలు సాధిస్తున్న మహిళా క్రికెటర్లకు బీసీసీఐ ...

news

పాకిస్థాన్ నడ్డివిరిచిన ఏక్తాబిస్త్.. 74 పరుగులకే చాపచుట్టేసింది.. ఛాయ్‌వాలా కూతురైనప్పటికీ?

మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల ...

news

టీమ్‌కే చేతగాని చోట ధోనీమీద పడితే ఏం లాభం.. కసురుకున్న గవాస్కర్

లక్ష్య ఛేదనలో వరుసగా ఫెయిలవుతున్న మహేంద్ర సింగ్ ధోనీని టీమిండియాలోంచి పీకేయాలని విమర్శలు ...

Widgets Magazine