గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (13:30 IST)

సచిన్ చాలా స్పీడు గురూ.. అంజలికి రోజంతా తలనొప్పి

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్లోనే కాదు.. బీఎండబ్ల్యూ కారు డ్రైవింగ్‌లోనూ చాలా స్పీడంట. సాధారణంగా రోడ్డుపై కారు శరవేగంగా దూసుకుపోతుంటే ఎంతో థ్రిల్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు. అది కూడా ఓ బీఎండబ్ల్యూ కారు అయితే... ఇక మాటల్లో చెప్పాలా? సచిన్ టెండూల్కర్ కూడా అలానే చేశాడు. ఇక సచిన్ స్పీడుకు అతని భార్య అంజలి హడలిపోయిందట. 
 
తలనొప్పి వచ్చి ఒక రోజంతా బాధపడిందని సచిన్ స్వయంగా తెలియజేశారు. స్వతహాగా మోటార్ రేసింగును ఇష్టపడే సచిన్‌కు ఓ బీఎండబ్ల్యూ కారును ఇచ్చి నడిపి చూడమని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. అంజలి కూడా వచ్చి తన పక్కన కూర్చుందని, ఆ సమయంలో చాలా వేగంతో కారును నడిపానని, అంజలితో పాటు తనకూ తలనొప్పి వచ్చిందని తెలిపాడు. అన్నట్టు ఈ ఘటన ఇప్పుడిప్పుడే జరిగిందనుకుంటే పొరపాటే.. ఎప్పుడో జరిగిన ఘటనను సచిన్ గుర్తు చేసుకున్నాడు.