శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:37 IST)

కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ ఎవరంటూ తొమ్మిదో తరగతి పరీక్షల్లో ప్రశ్న... విస్తుపోయిన స్టూడెంట్స్

థానేలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు ఓ వింత ప్రశ్న ఎదురైంది. భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేయసి ఎవరూ అంటూ తమకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో పేర్కొని.. దానికి కింద ముగ్గురు హీరోయిన్

థానేలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు ఓ వింత ప్రశ్న ఎదురైంది. భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేయసి ఎవరూ అంటూ తమకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో పేర్కొని.. దానికి కింద ముగ్గురు హీరోయిన్ల పేర్లు ఇచ్చారు. 
 
థానేలోని భివాండిలో చాచా నెహ్రూ హిందీ హైస్కూల్‌ ఉంది ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పర్సనల్ ట్రైనింగ్ పరీక్షను నిర్వహించారు. వీరికి ఇచ్చిన ప్రశ్న పత్రంలో కోహ్లీ ప్రియురాలు ఎవరు అనే ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నతో పాటు దానికి మూడు సమాధానాలు ఇచ్చారు. 
 
ఈ సమాధానాల్లో ప్రియాంకా, అనుష్క శర్మ, దీపికా పదుకొనే అనే మూడు సమాధానాలు ఇచ్చారు. ఈ ప్రశ్న వ్యవహారం లీక్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ ఏఆర్ పాండే వివరణ ఇచ్చారు. ప్రశ్నపత్రం తయారు చేసిన పీటీ ఉపాధ్యాయుడిదే తప్పు అని చెప్పాడు.