గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (19:15 IST)

వరల్డ్ కప్‌లో టీమిండియాదే టైటిల్: మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్

వరల్డ్ కప్‌లో టీమిండియాదే టైటిల్ అని మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2011లో గెలుచుకున్న టైటిల్‌ను టీమిండియా నిలబెట్టుకుంటుందని గ్యారీ కిర్ స్టెన్ చెప్పారు.

ఎవరెన్ని కథనాలు రాసినా, రాయకపోయినా... టీమిండియా విజయం మాత్రం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలను ఆయన మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణించారు. 
 
‘‘టీమిండియా టైటిల్‌ను నిలబెట్టుకుని తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బలమైన బ్యాంటింగ్ లైనప్ వారి సొంతం. నాకౌట్ దశలో ఎలా ఆడాలన్న విషయం వారికి తెలుసు. 2011లో వారి ప్రదర్శన అద్భుతం’’ అని కిర్ స్టెన్ వ్యాఖ్యానించారు.
 
మరోవైపు భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు హర్భజన్ సింగ్, వరల్డ్ కప్‌కు వెళ్లిన టీమిండియా జట్టు కూర్పుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో సరైన ఆటగాళ్లే ఉన్నారన్న అతడు, జట్టులోని సభ్యులంతా సత్తా గలవారేనని వ్యాఖ్యానించాడు. ఈసారి వరల్డ్ కప్ కూడా భారత్ దేనని భజ్జీ తెలిపాడు.