శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (19:10 IST)

క్రికెటైటిస్‌తో జాతికే నష్టం.. టీమిండియాను ఓడించండి!: వర్మ 'sooooo happyyy'

ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ఏంటో నిరూపించుకున్నారు. వరల్డ్ కప్ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలై వరల్డ్‌ కప్‌ టోర్నీనుండి నిష్క్రమించిన సందర్భంగా వర్మ పలు సంచలన కామెంట్స్‌ చేశారు. ఒకవైపు భారత క్రికెట్‌ అభిమానులంతా బాధతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానంటూ వర్మ టీట్‌ చేశాడు. 
 
క్రికెటైటిస్‌ అనే వ్యాధి పట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మందు, సిగరెట్‌ వల్ల నష్టం వ్యక్తుల వరకేనని, కానీ క్రికెట్‌ వల్ల దేశానికి నష్టం కలుగుతుందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ సంగతికొస్తే.. టీమిండియా ఓడిపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను క్రికెట్‌ను ద్వేషిస్తాను. నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి క్రికెట్‌ను ద్వేషిస్తున్నాను. క్రికెట్‌ వల్ల దేశానికి చాలా నష్టం కలుగుతుంది. చాలా మంది క్రికెట్‌ మ్యాచ్‌ సమయంలో పని చేయకుండా టీవీలు చూస్తూ ఉండి పోతున్నారు అని వర్మ ట్వీట్‌ చేశారు. 
 
కాగా క్రికెటైటిస్‌ అనే ప్రమాదకరమైన వ్యాధి నుంచి ఈ దేశ పౌరులను కాపాడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. టీమిండియాను మళ్లీ కూడా ఓడించాలని ఇతర దేశాలకు రిక్వెస్ట్ చేస్తున్నారు. దేశ పౌరులు క్రికెట్‌ చూడటం ఆపేసి చక్కగా పని చేసుకునే ఆలోచన వచ్చే వరకు ఈ విధంగానే ఓడించాలని కోరుకుంటున్నాని వర్మ ట్వీట్‌ చేశాడు. 
 
ఆల్కహాల్‌, సిగరేట్‌ వంటి వాటికి బానిస కావడం వల్ల నష్టం వ్యక్తి వరకే పరిమితం అవుతుంది. కానీ ఈ దేశం క్రికెట్‌కు బానిసైతే అది జాతీయ వ్యాధి అవుతుంది. కాగా ద్వేషించే వాళ్లను నేను ప్రేమిస్తా ఎందుకంటే ద్వేషం ప్రేమకంటే స్పైసీగా ఉంటుందని వర్మ ట్వీట్‌ చేశాడు.