బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:40 IST)

నాకు రిటైర్మెంట్ ఆలోచన లేదన్న సచిన్‌కు గెంటేస్తామని చెప్పేశాం : సందీప్ పాటిల్

భారత క్రికెట్ జట్టు నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిష్క్రమించకుండా ఉండివుంటే ఖచ్చితంగా తామే జట్టు నుంచి తొలగించవుండేవాళ్లమని టీమిండియా చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ

భారత క్రికెట్ జట్టు నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిష్క్రమించకుండా ఉండివుంటే ఖచ్చితంగా తామే జట్టు నుంచి తొలగించవుండేవాళ్లమని టీమిండియా చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన ఈ తరహా వ్యాఖ్యలు పదవి పోయాక చేయడం గమనార్హం.
 
మరాఠీ చానల్ 'ఏబీపీ మజా'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంటును ప్రకటించకుంటే, తామే తీసేయాలన్న నిర్ణయానికి వచ్చామని, కానీ అతనే హుందాగా తప్పుకున్నారని చెప్పాడు. 
 
"డిసెంబర్ 12, 2012న మేము సచిన్ ను కలసి 'నీ భవిష్యత్ ప్లాన్ ఏంటి?' అని అడిగాం. తన మనసులో రిటైర్మెంట్ ఆలోచన లేదని చెప్పాడు. అప్పట్లో సెలక్షన్ కమిటీ సచిన్‌ను తొలగించాలన్న నిర్ణయానికే వచ్చింది. ఇదే విషయాన్ని సచిన్‌కు చెప్పాం. మా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆయన, తదుపరి సమావేశం జరిగేలోగానే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనలా చేయకుంటే, మేమే ఖచ్చితంగా తొలగించి ఉండేవాళ్లం" అని అన్నాడు.