శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (18:03 IST)

ధోనీ కెరీర్‌‌లో గంగూలీదే కీలక నిర్ణయం.. ఆ నిర్ణయం నాదేనన్న దాదా.. ఏంటది?

వన్డేల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని మూడో స్థానంలో దింపాలనే నిర్ణయం తీసుకున్నది ఒకప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ అట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. ధోనీ కెరీర్‌లో వైజాగ్‌ వన్డే ఎంత కీలకమో ప్రతి ఒ

వన్డేల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని మూడో స్థానంలో దింపాలనే నిర్ణయం తీసుకున్నది ఒకప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ అట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. ధోనీ కెరీర్‌లో వైజాగ్‌ వన్డే ఎంత కీలకమో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆ వన్డేలో వన్ డౌన్‌లో మైదానంలోకి వచ్చిన ధోని పాకిస్థాన్‌‌పై సునామీలా విరుచుకుపడి, 15 ఫోర్లు, 4 సిక్సులతో 148 పరుగులు చేశాడు. 
 
ఒక్క ఇన్నింగ్స్‌తో ధోనీ పేరు దేశమంతటా మోరుమోగిపోయింది. అంతకుముందు ఆడిన వన్డేల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోనీని.. ఈ వన్డేలో మూడో స్థానంలో దించిన ఘనత గంగూలీదే. వైజాగ్‌‌లో మ్యాచ్‌‌కి ముందు కూడా ధోనీ 7వ స్థానంలోనే ఆడాలని నిర్ణయించామని, మ్యాచ్ మొదలైన తరువాత, అతనిలో సత్తా ఉందని గ్రహించాను.
 
ఇంకా డ్రెస్సింగ్‌ రూమ్‌‌లోని ధోని వద్దకెళ్లి, మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని చెప్పినట్టు గంగూలీ గుర్తుచేసుకున్నాడు. అప్పుడు ధోనీ, నీ సంగతేంటి? అని ప్రశ్నించాడని సౌరవ్ తెలిపాడు. తాను నాలుగో స్థానంలో వస్తానని చెప్పానని గంగూలీ అన్నాడు.

నాటి గంగూలీ నిర్ణయం భారత క్రికెట్‌కు ఎంతటి స్టార్ ఆటగాడిని సంపాదించిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 2011లో వన్డే ప్రపంచ కప్ గెలుచుకుంది. 2007లో ప్రపంచ ట్వంటీ-20 కప్‌ను సొంతం చేసుకుంది.