బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 జులై 2016 (16:02 IST)

మరణం అంచులకు వెళ్లిన భారత క్రికెటర్.. ఎవరా క్రికెటర్!

భారత క్రికెటర్ మరణం అంచులకు వెళ్లాడు. అక్కడ నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ క్రికెటర్ ఎవరో తెలుసా. కరుణ్ నాయర్. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 24 యేళ్ల క్రికెటర్.

భారత క్రికెటర్ మరణం అంచులకు వెళ్లాడు. అక్కడ నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ క్రికెటర్ ఎవరో తెలుసా. కరుణ్ నాయర్. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 24 యేళ్ల క్రికెటర్. ఇటీవల భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటించిన జట్టులో ఓ సభ్యుడు. ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీమిండియాలో ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చారు.
 
ఇంతకీ ఈ క్రికెటర్‌కు జరిగిన ప్రమాదమేంటనే కదా మీ సందేహం. ఇటీవల కేరళలోని పార్థసారథి ఆలయంలో నిర్వహించే ‘వాల్ల సద్య’ ఉత్సవంలో పాల్గొనేందుకు భారత క్రికెటర్ కరుణ్ నాయర్ బోటులో వెళ్తున్నారు. పంపానదిలో బోటు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా తల్లకిందులైంది. ఆ సమయంలో బోటులో వందమందికిపైగా ఉన్నారు. వీరందరూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇద్దరి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.
 
ఆదివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరనములల ఆలయానికి మరికొద్ది సేపట్లో బోటు చేరుకుంటుందనగా ప్రమాదం చోటుచేసుకుంది. బోటు తిరగబడిన వెంటనే రెస్క్యూ బోట్లు రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు చేర్చాయి. ఇలా రక్షించిన వారిలో కరుణ్ నాయర్ కూడా ఒకరు. గల్లంతైన ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కర్ణాటకకు చెందిన కరుణ్ నాయర్(24) ఇటీవల జింబాబ్వేలో పర్యటించిన జట్టులో సభ్యుడు. కాగా ప్రస్తుత వెస్టిండీస్ టూర్‌లో ఆయనకు విశ్రాంతి ఇచ్చారు.