శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 12 జులై 2015 (16:56 IST)

హరారే వన్డే : భారత్ 271/8... జింబాబ్వే విజయలక్ష్యం 272

హరారే వేదికగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు పర్యాటక జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రహానే 63, మురళీ విజయ్ 72 పరుగులతో రాణించి ఓపెనింగ్ భాగస్వామ్యంగా 112 పరుగులు జోడించారు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అంబటి రాయుడు 41, మనోజ్ తివారీ 22, కీపర్ ఊతప్ప 13, స్టువర్ట్ బిన్నీ 25, జాదవ్ 16, హర్భజన్ 5 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 13 రన్స్ వచ్చాయి. దీంతో భారత్ 50 ఓవర్లలో 5.42 రన్‌రేట్‌తో 271 పరుగులు చేసింది. 
 
జింబాబ్వే బౌలర్లలో మెజ్డివ నాలుగు వికెట్లు తీయగా, విటోరి, తిరిపనో, చిబాబా, సికిందర్ రాజాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఆ తర్వాత జింబాబ్వే జట్టు 272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టింది. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తొలి వన్డేలో గెలుపొందిన విషయం తెల్సిందే.