శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (11:23 IST)

బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్: 408 పరుగులకు టీమిండియా ఆలౌట్!

బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 408 పరుగులకు ఆలౌటైంది. 311/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ చివరి 6 వికెట్లను త్వరితగతిన చేజార్చుకుంది. రోహిత్ శర్మ 32, కెప్టెన్ ధోనీ 33, అశ్విన్ 35 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో పేసర్ హాజెల్ ఉడ్‌కు 5 వికెట్లు దక్కాయి. ఆఫ్ స్పిన్నర్ లియాన్ 3 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించనుంది.
 
కాగా అంతకుముందు బ్రిస్బేన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓపెనర్ మురళీ విజయ్ (144) సెంచరీ సాధించగా, వరుసగా రెండో టెస్టులోనూ శిఖర్ ధావన్ (24) నిరాశపరిచాడు. ఛటేశ్వర్ పుజారా(18) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. 
 
తొలి టెస్టులో రెండు సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ (19) రెండో టెస్టులో విఫలమయ్యాడు. అజింక్యా రహానే (75), రోహిత్ శర్మ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్ బౌలర్ జోష్ హాజెల్ ఉడ్ రెండు వికెట్లు తీయగా, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.