శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (18:36 IST)

ముక్కోణపు సిరీస్ : ఆస్ట్రేలియా ఘనవిజయం, స్మిత్ రికార్డ్

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసి విజయం సాధించింది.
 
ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెల్ 141 పరుగులు, రూట్ 69, అలీ 46, బట్లర్ 25 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సాండ్యు రెండు వికెట్లు, ఫాల్‌క్నేర్, హెన్రీక్స్, కుమ్నిస్, స్టార్క్ తలో వికెట్ తీశారు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా ధీటుగా రాణించింది. కెప్టెన్ స్మిత్(నాటౌట్)102, మార్స్ 45, ఫించ్ 32, మాక్స్‌వెల్ 37, హద్దీన్ 42 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు.
 
చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో ఆస్ట్రేలియానే విజయం వరించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిన్, అలీ, వోక్స్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా, ముక్కోణపు వన్డే సిరీస్‌లో వరుసగా మూడు విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. 
 
స్మిత్ వరల్డ్ రికార్డు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులో అజేయ సెంచరీ చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టిన అరంగేట్రం టెస్ట్, వన్డే మ్యాచుల్లో సెంచరీలు సాధించిన ఆటగాడిగా స్టీవ్ స్మిత్ రికార్డు సాధించాడు. 
 
తొలిసారి టెస్ట్ జట్టుకు సారథ్యం వహించిన స్మిత్, ఇండియాతో జరిగిన తొలి మ్యాచులోనే సెంచరీ నమోదు చేశాడు. అతని సారథ్యంలో ఆసీస్ జట్టు 2-0తో గెలిచిన సంగతి తెలిసిందే. అంతేగాక ఈ సిరీస్‌లో స్మిత్ మొత్తం 4 సెంచరీలు నమోదు చేశాడు.