శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (10:41 IST)

కోహ్లీ, అనుష్క త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు: బీసీసీఐ

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా పరాజయంతో కోచ్‌, కెప్టెన్ ధోనీపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ధోనీని ఇప్పట్లో తొలగించేది లేదని సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా పరాజయంలో విరాట్ కోహ్లీ విఫలం ప్రధానమైనదేనని బీసీసీఐ ఒప్పుకుంది.
 
అనుష్క శర్మను తోడు తెచ్చకుంటానంటూ కోహ్లీ అడగ్గానే బీసీసీఐ ఓకే చెప్పేయడంతోనే భారత్ పరాజయం పాలైందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది.
 
‘‘వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ విషయం తెలిసినందునే కోహ్లీ వెంట వచ్చేందుకు అనుష్కకు అనుమతిచ్చాం’’ అంటూ బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అనుష్కను తోడు తెచ్చకున్న కోహ్లీ, రెండు ఇన్నింగ్స్‌లు బాగానే ఆడినా, ఆ తర్వాత ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.
 
మరోవైపు బీసీసీఐ టూర్లకు వెళ్ళే క్రీడాకారులు తమ వెంట లవర్లని కాదు కదా, సొంత భార్యలని కూడా తీసుకుని వెళ్ళకూడదని బీసీసీఐ నిబంధన విధించింది.