బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (15:31 IST)

భారత జట్టులో మార్పులు మంచికే : బీసీసీఐ కార్యదర్శి పటేల్

భారత క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న పెనుమార్పులపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ స్పందించారు. భారత క్రికెట్ జట్టు డైరైక్టర్‌గా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి నియామకంతో ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందన్నారు. కోచింగ్ నిర్మాణంలో ఈ మార్పు భారత క్రికెట్‌కు మంచిదేనని అన్నారు. 
 
అయితే ఇంగ్లండ్‌తో గత మూడు టెస్టుల్లో ఎదురైన పరాభవాల నేపథ్యంలో కెప్టెన్ ధోనీని, కోచ్ ఫ్లెచర్‌ను మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఫ్లెచర్ భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడడం తగదని అన్నారు. ‘బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని కెప్టెన్, కోచ్‌లకు తెలిపాను. వారిద్దరూ దీనికి అంగీకరించారు. ఇప్పుడు టీమ్ రవిశాస్త్రితో ఉందన్నారు. 
 
కాగా, టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రి పేరును సంజయ్ పటేలే సూచించారు. అయితే ఈ పదవికి అతడి పేరును మాత్రమే లెక్కలోకి తీసుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు అన్ని ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, జట్టు ప్రయోజనాల కోసం రవిశాస్త్రి దీనికి అంగీకరించడం సంతోషకరమని చెప్పారు.