గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By IVR
Last Modified: బుధవారం, 23 జులై 2014 (12:38 IST)

నెస్ పై ప్రీతీజింటా లేఖ... బాలీవుడ్‌ షాక్... స్పందనలు

ప్రీతి జింటా మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను మానసికంగానూ, శారీరకంగా హింసించాడని ప్రీతీజింటా మంగళవారం నాడు ముంబై పోలీస్ కమిషనర్‌కి లేఖ రాసింది. ప్రీతీజింటా లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రీతీజింటా బాలీవుడ్ సహచరులు ఈ లేఖలోని విషయాలను తెలుసుకుని బిత్తరపోయినట్లు తెలుస్తోంది. ప్రీతి జింటా లేఖ సారాంశాన్ని చూసిన బాలీవుడ్ ప్రముఖులు షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ అనుభవిస్తున్నారని వారు వెల్లడిస్తున్న స్పందనలను బట్టి అర్థమవుతోంది. 
 
తమ మధ్య నవ్వుతూ, తుళ్ళుతూ ఉంటూ, క్రికెట్ టీమ్ ఓనర్‌గా కూడా యాక్టివ్‌గా వుంటే ప్రీతీజింటా జీవితంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా అని వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. నెస్ వాడియాతో ప్రీతీజింటాకి వున్న గొడవలు టీ కప్పులో తుఫానులాగా సమసిపోతాయని వారంతా భావించారు. అయితే ఈ సమస్య ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ సమస్య నుంచి ప్రీతీ జింటా సాధ్యమైనంత త్వరగా బయటపడాలని బాలీవుడ్ కోరుకుంటోంది.