గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (16:09 IST)

పాత హెల్మెట్ పెట్టుకోవడం వల్లే హ్యూస్‌కు ప్రాణాపాయం!

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్‌ సిడ్నీ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ బంతి తలకు తగలడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా హ్యూస్ కోమాలోనే ఉన్నారు. బౌలర్ విసిరిన బంతి హెల్మెట్‌లో నుంచి వెళ్ళి మరీ ఆయన తలకి తగిలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నామని వైద్యులు చెపుతున్నారు. 
 
అయితే, హ్యూస్ పాత మోడల్ హెల్మెట్‌ వాడటం వల్లనే ప్రాణాలమీదకి తెచ్చుకున్నాడని హ్యూస్ ధరించిన హెల్మెట్ తయారు చేసిన సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఈ హెల్మెట్‌ని బ్రిటన్‌కి చెందిన ఓ సంస్థ తయారు చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో హ్యూస్ ధరించింది పాత మోడల్ హెల్మెట్ అని, కొత్త మోడల్ హెల్మెట్ ధరిస్తే ప్రమాదం ఇంత తీవ్ర స్థాయిలో ఉండేది కాదని చెపుతున్నారు.