శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (11:40 IST)

బంగ్లాదేశ్‌తో చివరి వన్డే: వెస్టిండీస్ రికార్డ్ గెలుపు

బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా బాస్సెటెర్రెలోని వార్నర్ పార్క్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ బ్యాట్స్‌మన్లు దినేష్ రామ్‌దిన్, డారెన్ బ్రావో సెంచరీలతో ఊపేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 
 
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో ఐదవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ అమిన్ హుస్సేన్ చక్కగా రాణించి నాలుగు వికెట్లు కైవసం చేసుకోగా, మషఫ్రీ మోర్తజా, అబ్దుర్ రజాక్, మహ్మదుల్లా ఒక్కో వికెట్ సాధించారు.
 
ఆ తర్వాత 339 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు మాత్రమే రాబట్టిన బంగ్లాదేశ్ జట్టు 91 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలై 0-3 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలువడంతో పాటు ఈ సిరీస్‌లో చక్కటి ప్రదర్శనతో రాణించిన దినేష్ రామ్‌దిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.