శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 14 ఆగస్టు 2014 (11:23 IST)

టెస్టు క్రికెట్‌కు మహేల జయవర్ధనే దూరం!

స్టైలిష్ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న మహేల జయవర్థనే తన ఆఖరి టెస్ట్‌కు సిద్ధమయ్యాడు. గురువారం శ్రీలంక-పాకిస్థాన్‌ల మధ్య జరిగే రెండో టెస్ట్ మ్యాచే మహేలకు ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. 
 
ఇప్పటికే తొలి టెస్ట్ నెగ్గి మంచి ఊపు మీదున్న శ్రీలంక... రెండో టెస్ట్ కూడా గెలిచి మహేలకు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తోంది. 17 ఏళ్ల పాటు శ్రీలంక క్రికెట్‌కు వెన్నముకగా నిలిచిన మహేల... సహచరుడు సంగక్కరతో కలిసి తన దేశానికి ఎన్నో అద్భుత విజయాలను అందించాడు.