శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (12:48 IST)

కోహ్లీతో ఇంగ్లండ్‌కు అనుష్క శర్మ: బీసీసీఐ ఎలా పర్మిషన్ ఇచ్చింది?

కోహ్లీతో ఇంగ్లండ్‌కు అనుష్క శర్మ: బీసీసీఐ ఎలా పర్మిషన్ ఇచ్చింది? ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్. ఇంగ్లండ్ సిరీస్‌లో భాగంగా విరాట్ కోహ్లీతో గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను ఎవరు ఉండనిచ్చారనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. 
 
అసలు కోహ్లీతో పాటు అనుష్కశర్మను ఇంగ్లండ్ వెళ్లేందుకు బీసీసీఐ ఎలా అనుమతి ఇచ్చిందన్న దానిపై చర్చ మొదలైంది. బీసీసీఐ నియమ నిబంధనల ప్రకారం విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు... క్రికెటర్లతో పాటు కేవలం వారి భార్యలకు మాత్రమే అనుమతి ఇస్తారు. 
 
పెళ్లికాని క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్‌ను విదేశీ టూర్లకు తీసుకువెళ్లడం బీసీసీఐ నియమావళికి విరుద్ధం. అయితే కోహ్లీ ఇంగ్లండ్ టూర్‌కు తనతో పాటు అనుష్కశర్మను కూడా తీసుకువెళతానంటే... ఏమాత్రం ఆలస్యం లేకుండా... ఆలోచన చేయకుండా బీసీసీఐ వెంటనే అనుమతి ఇచ్చింది. ఈ తప్పుడు నిర్ణయాన్ని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తీసుకున్నారని బీసీసీఐ అధికారులు అంటున్నారు.
 
పెళ్లికాని విరాట్ కోహ్లీ... తన గర్ల్ ప్రెండ్ అనుష్కశర్మను ఇంగ్లండ్ టూర్‌కు తీసుకువెళతానని అడిగితే బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వెంటనే అంగీకరించారని బోర్డు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దీంతోపాటు అనుష్కశర్మ కోహ్లీతో కలిసి టీమిండియా బస చేసే హోటల్‌లో ఉండేందుకు అనుమతించాలని సంజయ్ పటేల్ టీం మేనేజ్ మెంట్‌ను ఆదేశించారని ఆ ఉన్నతాధికారి వివరించాడు.
 
అనుష్కశర్మతో ప్రేమకలాపాల్లో మునిగిపోవడం వల్లే... కోహ్లీ ఇంగ్లండ్ టూర్‌లో రాణించలేకపోతున్నాడని క్రీడా పరిశీలకులతో పాటు అభిమానులు కూడా వాపోతున్నారు. కీలకమైన ఇంగ్లండ్ టూర్‌లో కోహ్లీతో పాటు ఉండడానికి అనుష్కశర్మకు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ఏ మాత్రం ఆలోచన లేకుండా ఎలా అనుమతి ఇచ్చారని వారు ఆయనపై మండిపడుతున్నారు.