శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (13:00 IST)

కోహ్లీ షాట్ల సెలక్షన్ మరీ చెత్తగా ఉంది : జెఫ్రీ బాయ్‌కాట్

భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ తీరు, షాట్ల ఎంపికపై అంతర్జాతీయ క్రికెట్ నిపుణులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో అత్యంత దారుణంగా కోహ్లీ విఫలం కావడంపై ఇంగ్లండ్ మాజీ సారథి జెఫ్రీ బాయ్‌కాట్ స్పందిస్తూ.. కోహ్లీ బ్యాటింగ్ సమయంలో బుర్ర ఉపయోగించాలని సలహా ఇచ్చారు. షాట్ సెలెక్షన్ మరీ చెత్తగా ఉందని అభిప్రాయపడ్డారు. 
 
కోహ్లీ మదిలో గందరగోళం నెలకొని ఉన్నట్టుందని, అందుకే రెండో వన్డేలో రాంగ్ షాట్ ఆడి అవుటయ్యాడని బాయ్ కాట్ విశ్లేషించారు. ప్రతిభ ఉన్నా, తెలివిలేకుండా అది రాణించదని సూచించారు. కోహ్లీ కూడా ఇలానే తన నైపుణ్యాన్ని వృథా చేసుకుంటున్నాడని తెలిపారు. కాగా, కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కోహ్లీ డకౌట్ అయిన విషయం తెల్సిందే.