బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 12 అక్టోబరు 2014 (14:53 IST)

హుదూద్ తుఫానుతో భారీ వర్షాలు.. 14న విశాఖ వన్డే అనుమానమే!

హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్టణంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఈనెల 14వ తేదీన భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్‍‌ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. నిజానికి హుదూద్ తుఫాను ఆదివారం మధ్యాహ్నం తీరం దాటినా, మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటికే విశాఖ ప్రాంతంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ వన్డే నిర్వహణ అసాధ్యంగా మారింది. 
 
హుదూద్ తుఫాను తీరం దాటడంతో విశాఖపట్నం భయం గుప్పిట్లో చిక్కుకుంది. ఉప్పెన అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా, అక్టోబర్ 14వ తేదీన విశాఖలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. తుఫాను కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ కారణంగా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సాధ్యం కాదని బ్రాడ్ కాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ వెళ్ళడం సురక్షితం కాదని వారు భావిస్తున్నారు. వేదికను మార్చాలని ఆశిస్తున్నామని, అయితే, ఇంతవరకు ఏ విషయం తెలియరాలేదని చెప్పారు.