శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (16:09 IST)

ప్రతిభను చిన్నతనంలోనే గుర్తించాలి : సచిన్ టెండూల్కర్

చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి, ఆ ప్రతిభను పెపొందించేందుకు భారతదేశంలో ఓ వ్యవస్థ లేకపోవడంపై క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. తన మనస్సులోని భావాలను వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో పోటీపడేందుకు మన యువతకి తగిన మౌలిక సదుపాయాలు లేవన్నారు. 
 
కేరళలోని కొచ్చిలో ఇండియన్ సూపర్ లీగ్ టీమ్ కేరళ బ్లాస్టర్స్‌‌కు చెందిన జెర్సీ‌తో పాటు థీమ్ సాంగ్‌ను ఆవిష్కరించిన తర్వాత సచిన్ మాట్లాడుతూ... చాలా దేశాల్లో చిన్న వయసులోనే ప్రతిభను గుర్తిస్తున్నారు. ఐతే భారతదేశంలో మాత్రం ఇది జరగడం లేదు. మన టాలెంట్‌ను గుర్తించినప్పటికే వారు టీనేజీలో ఉంటారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పోటీపడటానికి అప్పటికే ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చాడు.