శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (12:21 IST)

ముక్కోణపు సిరీస్ : శిఖర్ ధావన్ అనవసరపు షాట్‌కు అవుట్!

ట్రై-సిరీస్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసిన అనంతరం 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అనవసరపు షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. 
 
ఇప్పటికే వరుస వైఫల్యాలతో పేలవ ఫామ్ కనబరుస్తున్న ధావన్ ఈ మ్యాచులోనూ రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 8 పరుగులు చేసిన ధావన్ స్టార్క్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సమయానికి భారత స్కోరు 6 ఓవర్లకు 24 పరుగులు.
 
అనంతరం 23 పరుగులు చేసిన అంబటి రాయుడు మార్ష్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 64 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. కాగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురియడంతో ఈ మ్యాచును 44 ఓవర్లకు కుదించారు.