శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (09:02 IST)

ఓవల్ టెస్టులో భారత్ ఘోర పరాజయం : ఇంగ్లండ్‌ సిరీస్ విజేత!

ఓవల్ టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చేతిలో ఇన్నింగ్స్, 244 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 3-1 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే భారత్ ఆలౌట్ అవ్వగా... బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 486 పరుగులు చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. 
 
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 94 పరుగులకే కుప్పకూలింది. స్టువర్ట్ బిన్నీ 25 పరుగులు, విరాట్ కోహ్లి 20, పూజారా 11 పరుగులు చేశారు. మిగతా వారందరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. దీంతో, ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓటమి పాలైంది. 
 
చివరి టెస్ట్ మూడో రోజున ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 486 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 329 పరుగుల ఆధిక్యం లభించింది. రూట్ 149 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఇషాంత్ 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. 
 
రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లలో విజయ్ 2, గంభీర్ 3, పుజారా 11, కోహ్లీ 20, రెహానే 4, ధోనీ 0, బిన్నీ 25 (నాటౌట్), అశ్విన్ 7, కుమార్ 4, అరూన్ 1, శర్మ 2 చొప్పున మాత్రమే పరుగులు చేయగా, ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ 4, ఆండర్సన్ 2, బ్రాడ్, వోక్స్‌లు ఒక్కో వికెట్ తీసి భారత్‌ను చిత్తుగా ఓడించారు.