శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (19:18 IST)

సౌతాంప్టన్ టెస్ట్ : నిలకడగా ఇంగ్లండ్ బ్యాటింగ్.. భారత బౌలర్ల వికెట్ల వేట!

సౌతాంప్టన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసేందుకు భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఇందులో కుక్ 95, రోబ్సన్ 26 చేయగా, బ్యాలెన్స్, సెంచరీతో ఆదుకున్న విషయం తెల్సిందే. 
 
247/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌ జట్టు బ్యాట్స్‌మెన్లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో తొలి రోజు సెంచరీ హీరో బ్యాలెన్స్ (156) పరుగులు చేసి ఔట్ కాగా, బెల్ (89 నాటౌట్), రూట్ 3, అలీ (3 నాటౌట్) చొప్పున క్రీజ్‌లో ఉన్నాడు. మొత్తం 129.6 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ ధోనీ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగిస్తున్నప్పటికీ.. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు యధేచ్చగా బ్యాట్ ఝుళిపిస్తూ పరుగులు చేస్తున్నారు.