బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (19:18 IST)

ఆసీస్ పర్యటనకు టీమిండియా: ధోనీకి రెస్ట్, కోహ్లీ కెప్టెన్!

ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ప్రయాణమైంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ బృందం శనివారం ఆసీస్ పర్యటనకు బయల్దేరింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 18 సభ్యుల టీమిండియా డిసెంబర్ 4వ తేదీన బ్రిస్బేన్ లో తొలి టెస్టు జరుగనుంది. 
 
మహేంద్ర సింగ్ ధోనికి కుడి చేతి బొటన వ్రేలికి గాయం కావడంతో అతను ఈ టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో టీమిండియా బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించారు.
 
తొలిసారి టెస్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈ సిరీస్ ను తప్పకుండా గెలుస్తామనే ధీమానూ వ్యక్తం చేశాడు. అయితే భార్యకు ఆరోగ్యం బాగాలేనందున ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న కోచ్ డంకన్ ఫ్లెచర్ నేరుగా ఆస్ట్రేలియాలో జట్టుతో కలుస్తారు.
 
కాగా ఈ టెస్టు మ్యాచ్‌లలో డిసెంబర్ 4-8, తొలి టెస్టు(బ్రిస్బేన్), డిసెంబర్ 12-16న రెండో టెస్టు (అడిలైడ్) డిసెంబర్26-30, మూడో టెస్టు(మెల్ బోర్న్) జనవరి 3-7, నాల్గో టెస్టు(సిడ్నీ)