గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 ఆగస్టు 2014 (12:45 IST)

కోహ్లీ వెంటే ఉంటా.. ఇంగ్లండ్‌కు వెళ్తున్నా: రాజ్ కుమార్ శర్మ

ఇంగ్లండ్ సిరీసీలో వరస వైఫల్యాలతో బాధపడుతోన్న విరాట్ కోహ్లికి సాయపడేందుకు... అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడు. తనకు సాయపడేందుకు ఇంగ్లండ్ రావాలని కోహ్లి కోరాడని రాజ్ కుమార్ శర్మ తెలిపాడు. వీసా వచ్చిన వెంటనే ఇంగ్లండ్‌కు బయల్దేరతానని శర్మ వెల్లడించారు.
 
కోహ్లి టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదని... అయితే, అతను మరింత ఏకాగ్రతతో ఆడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. కోహ్లి చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని... తాను గాడిన పడటానికి ఒకే ఒక ఇన్నింగ్స్ చాలని అంటున్నాడని తెలిపారు. పదిరోజుల పాటు కోహ్లీతోనే తాను ఉంటానని... ఐదోటెస్ట్ మొదలయిన తర్వాత ఇండియాకు బయలుదేరతానని రాజీవ్ శర్మ తెలిపాడు.