శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 అక్టోబరు 2014 (12:34 IST)

మోహిత్ శర్మకు గాయం: ఇషాంత్ శర్మకు పిలుపు!

యువ బౌలర్ మోహిత్ శర్మ గాయపడటంతో విండీస్‌తో మిగిలిన నాలుగు వన్డేల్లో ఆడాల్సిందిగా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ పిలుపందుకున్నాడు. 
 
మోహిత్ శర్మ మోకాలి కింది భాగంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడని, దీంతో, ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతని స్థానాన్ని ఇషాంత్‌తో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వెల్లడించింది. 
 
కాగా, విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మోహిత్ విఫలమవడంతో.. భువనేశ్వర్‌కు సహకారం అందించే మరో పేస్ బౌలర్ లేక టీమిండియా టీమిండియా మ్యాచ్‌లో ఇక్కట్లు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.