గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (13:28 IST)

అలాంటి రిస్ట్ బ్యాండ్స్ ధరించవద్దు: మొయిన్ అలీకి ఐసీసీ క్లాజ్‌!

‘గాజాను రక్షించండి’, ‘పాలస్తీనాకు విముక్తి కల్పించండి’ అని రాసి ఉన్న రిస్ట్‌ బ్యాండ్‌ ధరించి మైదానంలోకి దిగిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌ మొయిన్‌ అలీకి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) క్లాజ్ తీసుకుంది. ఇకపై అలీ అలాంటి రిస్ట్‌ బ్యాండ్‌ ధరించకూడదంటూ ఐసీసీ నిషేధం విధించింది. పాకిస్థాన్‌ సంతతికి చెందిన అలీ చారిటీ సంస్థలకు విరాళాలు సేకరించేందుకు తనవంతు సహకారంగా ఈ రిస్ట్‌ బ్యాండ్‌ ధరించి బ్యాటింగ్‌కు వచ్చాడు.
 
ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌కు, గాజాకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అలీ ఇలా చేయడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం అనుమతిలేనిదే క్రికెటర్లు ఇలా సందేశాలిచ్చేలా దుస్తులుగానీ, ఇతర రిస్ట్‌ బ్యాండ్‌లుగానీ ధరించకూడదు. 
 
ప్రత్యేకించి రాజకీయ, మతపరమైన, జాతివివక్షతో కూడిన సందేశమిచ్చేలా అస్సలు ఉండకూడదు. అయితే అలీ చర్యను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సమర్థించినప్పటికీ ఆ రిస్ట్‌ బ్యాండ్‌ను తీసేయాలని మ్యాచ్‌ రెఫరీ డేవిడ్‌ బూన్‌ ఆదేశించాడు. దీంతో మొయిన్ ఊపిరిపీల్చుకున్నాడు.