గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (10:57 IST)

శ్రీనివాసన్‌కు క్లీన్ చిట్టా అలాంటిదేమీ లేదే : సుప్రీం కోర్టు

స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో క్లీన్ చిట్ లభించిందని శ్రీనివాసన్ అనుకుంటున్నాడే తప్ప వాస్తవానికి అలాంటిదేమీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఒక జట్టును కొనడం ఏమిటంటూ మండిపడింది. 
 
ఈ రకంగా ఐపిఎల్‌లో శ్రీనివాసన్‌కు స్వప్రయోజనాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్ అదే స్ఫూర్తితో కొనసాగేందుకు కృషి జరగాలని సూచించింది. అంతేగానీ క్రికెట్ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని పేర్కొంది.
 
ఆరో ఐపిఎల్ సమయంలో తెరపైకి వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ముకుల్ ముద్గల్ కమిటీ సమర్పించిన 35 పేజీల నివేదికను పరిశీలిస్తున్న సుప్రీం కోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.