శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (12:25 IST)

రాహుల్ ద్రవిడ్ : డబ్బు ఖర్చు పెడితే సరిపోదు.. అథ్లెట్లను గుర్తించి?

డబ్బు ఖర్చు పెడితే సరిపోదు. ప్రతిభావంతులైన అథ్లెట్లను గుర్తించి వారిని సానబట్టాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. పతక విజేతల సెర్చ్ హంట్ కోసం ఎనిమిది సభ్యుల టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో తనకు చోటు లభించడంపై ద్రవిడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 
 
క్రికెట్‌ను చూసి ఒలింపిక్ అథ్లెట్లు ఎంతో నేర్చుకోవచ్చని  చెప్పాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ సభ్యుడైన రాహుల్ యువ అథ్లెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ "అత్యున్నత స్ధాయిలో ప్రదర్శనకు ఏ క్రీడైనా ఒకటే. క్రికెట్‌ను చూసి ఇతర అథ్లెట్లు ఎంతో నేర్చుకోవచ్చు. ప్రతి ఆట మరో ఆటకు కొత్త సంగతులు నేర్పిస్తుంది" అని తెలిపాడు. 
 
గత కొన్ని సంవత్సరాలుగా ఓ అంతర్జాతీయ క్రీడతో మమేకమవుతున్నా. నా అనుభవం అంతర్జాతీయ అథ్లెట్ల సక్సెస్ కోసం పనికొస్తే చాలు అని చెప్పాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో మిగతా సభ్యులైన బింద్రా, గోపీచంద్, అంజూబాబీ జార్జ్‌లు అథ్లెట్లకు నాకన్నా మేలు చేయగలుగుతారు అని ద్రవిడ్ అన్నాడు.