బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (10:38 IST)

పఠాన్ సోదరుల క్రికెట్ అకాడమీ.. క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్!

పఠాన్ సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ తమ స్వస్థలమైన బరోడాలో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నారు. 'క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్‌'ను గురువారం వారు లాంచ్ చేశారు. వచ్చే నెలలో ఈ అకాడమీ మొదలుకానుంది. 
 
యువకులకు శిక్షణనిచ్చి వారిని ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దాలన్నది తమ చిరకాల కోరికని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇర్ఫాన్ తెలిపాడు. తమ అకాడమీలో రెండు దశల్లో శిక్షణనిస్తామని చెప్పాడు. 
 
మొదటి దశలో 8 నుంచి 9 వారాల శిక్షణ ఉంటుందన్నాడు. ఆతర్వాత అడ్వాన్స్ కోర్సుకు వారు అర్హులవుతారని చెప్పాడు. అకాడమీలోని కోచ్‌లకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ శిక్షణనిస్తాడని చెప్పాడు.
 
కాగా వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ పోటీలు మొదలయ్యేలోగా టీమిండియాలో చోటు సంపాదించడమే తన లక్ష్యమని యూసుఫ్ పఠాన్ అన్నాడు. ఈ సీజన్‌లో తన ప్రదర్శన సంతృప్తికరంగానే సాగిందన్నాడు. కాగా, ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ తన సోదరుడు యూసఫ్‌ను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు.