బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (14:24 IST)

హ్యూస్ మృతి: అబాట్‌ను ఓదారుస్తున్న ఫిల్ సోదరి మేగాన్!

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యస్ మృతికి కారణమైన బౌన్సర్‌ను విసిరిన షాన్ అబాట్ ఇప్పుడు జీవితకాల వేదనతో బాధపడుతున్నాడు. 
 
హ్యూస్ మరణానికి తాను తప్పేమీ చేయకపోయినా.. అపరాధన భావన అతడిని పట్టి పీడిస్తుంది. అయితే యావత్ క్రికెట్ ప్రపంచం ప్రస్తుతం అబాట్‌ను ఓదారుస్తూ, ఊరడిస్తూ, మద్దతు తెలుపుతోంది. 
 
అంతేగాకుండా తను తప్పేమీ చేయలేదంటూ ఈ యువ బౌలర్‌కు క్రికెటర్లందరూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. క్రికెటర్లే కాదు, హ్యూస్ సోదరి మేగాన్ కూడా అబాట్‌ను ఓదార్చిందట. 
 
గురువారం నాడు హ్యూస్ మరణవార్త విన్న వెంటనే సిడ్నీ ఆసుపత్రికి వెళ్లిన అబాట్‌ను అక్కడే ఉన్న మేగాన్ కలిసింది. అతడితో సుదీర్ఘంగా మాట్లాడి, బాధపడవద్దని చెప్పిందట.