శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (16:33 IST)

భారత జట్టుతో ఇప్పటికిప్పుడు అద్భుతాలు ఆశించొద్దు : రవిశాస్త్రి

భారత క్రికెట్ జట్టు టీమ్ డైరక్టర్‌గా నియమితులైన భారత క్రికెట్ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ రవిశాస్త్రి స్పందిస్తూ భారత క్రికెట్టుతో ఇప్పటికిప్పుడు అద్భుతాలు ఆశించవద్దన్నారు. ప్రస్తుతం తాను ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమైవున్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యం భారత ఆటగాళ్ళలో స్థైర్యాన్ని నింపడమేనన్నారు. అలాగే, భవిష్యత్‌పై ఇప్పుడేమీ మాట్లాడలేనని చెప్పారు. ప్రస్తుతం కోచ్ ఫ్లెచర్‌తో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. లార్డ్స్‌ క్రికెట్ మైదానంలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లలో ఎలా ఓడిపోయిందన్న అంశానికి సంబంధించి కారణాలు కనుగొనాల్సి ఉందన్నారు. 
 
కాగా, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. సిరీస్‌ను 3-1తో కోల్పోయిన విషయం తెల్సిందే. తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా, లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో బీసీసీఐ జట్టు టీమ్‌లో పేను మార్పులకు శ్రీకారం చుట్టింది.