శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (15:26 IST)

రవీంద్ర జడేజాపై ఐసీసీ యాక్షన్ : మ్యాచ్ ఫీజులో కోత!

భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంగ్లండ్ ప్లేయర్ అండర్సన్‌తో జడేజా గొడవ పడిన విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. రవీంద్ర జడేజా మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫీజు కోత విధించింది. రవీంద్ర జడేజా ఐసీసీ కోడ్ లెవెల్ -1 అతిక్రమించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
 
తొలిటెస్టులో ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్‌తో వాగ్వివాదం నెరిపిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చేదు అనుభవం ఎదురైంది. లార్డ్స్‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న జడేజాను ఉద్దేశించి ప్రేక్షకులు అవహేళన చేశారు.
 
దీనిపై రాహుల్ ద్రావిడ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు జడేజాను గేలి చేయడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందన్నాడు. తొలి టెస్టులో చోటు చేసుకున్న వివాదం గురించి వారికేం తెలుసని ద్రావిడ్ ప్రశ్నించాడు. అయితే ఆండర్సన్‌తో వాదనకు దిగడంతో జడేజాపై ఐసీసీ సీరియస్ కాక తప్పలేదని టాక్.