బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (14:03 IST)

'గానకోకిల'కు సచిన్ టెండూల్కర్ సత్కారం!

'గానకోకిల' లతా మంగేష్కర్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈనెల 28వ తేదీన ఘనంగా సన్మానించనున్నారు. ఆమె 28వ తేదీన 85వ జన్మిదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించాలని టెండూల్కర్ నిర్ణయించాడు. ఆ రోజున ముంబైలో జరిగే ఓ కార్యక్రమంలో సచిన్... తన అభిమాన గాయనిని సత్కరిస్తాడు. 
 
దీనిపై హృదయేశ్ ఆర్ట్స్ ఛైర్మన్ అవినాశ్ ప్రభావల్కకర్ మాట్లాడుతూ, ఈ సన్మాన కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. లత 13 ఏళ్ళ వయసులో అంటే 1943లో తొలి పాట పాడారు. మరాఠీ చిత్రం 'గజాభావు' చిత్రంతో గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె, ఇప్పటివరకు 36 భాషల్లో 1000కి పైగా పాటలు పాడారు.