శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (14:09 IST)

సానియాతో నా బంధం దృఢమైనది...! పెదవి విప్పిన షోయబ్..!

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ చాలా కాలం తర్వాత తన వైవాహిక జీవితంపై పెదవి విప్పాడు. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత వారి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయంటూ భారత్, పాక్ మీడియాలు కోడై కూశాయి. 
 
ఈ వార్తలు తరచూ వస్తుండడంపై షోయబ్ స్పందిస్తూ... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు.  ప్రస్తుతం తాము దుబాయ్ లో ఉన్నామన్నాడు. 'మా మధ్య ఎటువంటి బేధాభ్రిపాయాలు లేవు. మా జీవితం సాఫీగానే ఉంది. ఒక జంటగా మా మధ్య సమస్యలు అనేవి లేవు'  అని షోయబ్ స్పష్టం చేశాడు.
 
అదేవిధంగా పాక్ నటి హుమైమాతో కలిపి వస్తున్న వార్తలపై షోయబ్ మాట్లాడుతూ సానియా తన భార్య కాగా, హుమైమా తనకు ఒక మంచి స్నేహితురాలని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా వచ్చే ప్రపంచ కప్ కు ఆడతారా?అన్న ప్రశ్నకు సమాధానం షోయబ్ దాటవేశాడు.